కాకినాడ రూరల్: కరపలో అగ్నిప్రమాదం: రూ.10 లక్షల ఆస్తి నష్టం
కరప మండలం నడకుదురులో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా కిరాణా దుకాణం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు వీఆర్వో గణపతి తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.