ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో దారుణం: ఆసుపత్రి ఎదుట పసికందు మృతదేహం
ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా పసికందు మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని వ్యక్తులు శిశువును అక్కడ వదిలివెళ్లగా, కుక్కలు పీక్కుతింటుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.