ఖమ్మం అర్బన్: నేలకొండపల్లి: సమ్మెకు సిద్ధమైన ఆశా వర్కర్లు, డిసెంబర్ 15 డెడ్ లైన్
నేలకొండపల్లి మండలం బోదులబండ ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లు తమ డిమాండ్ల కోసం సమ్మె నోటీసు ఇచ్చారు. 18 వేల వేతనం, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. డిసెంబర్ 15లోపు ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.