పటాన్చెరు: ఇంద్రేశం - పటాన్చెరు ప్రధాన రహదారిపై గుంతలు: ఇబ్బందుల్లో వాహనదారులు
ఇంద్రేశం నుంచి పటాన్చెరు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. రోడ్డుపై అడుగడుగునా ఏర్పడిన గుంతలతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన చెందుతున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.