నాగర్ కర్నూల్: 192 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
నాగర్ కర్నూల్ బస్ డిపో వెనుక నిర్మించిన 192 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లక్కీ డ్రా ద్వారా పారదర్శకంగా కేటాయించారు. జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సమక్షంలో లబ్ధిదారులకు ఫ్లాట్ నంబర్లను కేటాయించారు. త్వరగా ఇళ్లలోకి చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.