ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ శివారులో ప్రమాదవశాత్తు డివైడర్ ను ఢీకొని ఒకరి మృతి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ శివార్లలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది చింతకొమ్మదిన్నె గ్రామానికి చెందిన ఇమ్మానియేల్ వ్యక్తి కూలి పని చేస్తున్నాడు పని నిమిత్తం ఆళ్లగడ్డకు బైక్ పై వచ్చాడు చింతకొమ్మదిన్నె గ్రామానికి తిరిగి వెళ్తుండగా ఇస్కాన్ టెంపుల్ సమీపంలోని డివైడర్ ను ప్రమాదవశాత్తు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు ఆళ్లగడ్డ టౌన్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు