ఒంగోలు అర్బన్: *స్త్రీ శక్తి పథకం మహిళలకు ఆర్థిక భరోసా : శాసనసభ్యులు ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు
Ongole Urban, Prakasam | Aug 15, 2026
ఒంగోలు నియోజకవర్గంలో మహిళలతో కలిసి కర్నూల్ రోడ్డు RTC బస్ స్టాండ్ నుండి మంగమూరు రోడ్డు జంక్షన్ వరకు బస్సులో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి మరియు ఉడా చైర్మన్ షేన్ రియాజ్ ప్రయాణించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “స్త్రీ శక్తి” పథకం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలు నగరంలో “స్త్రీ శక్తికి సంవత్సరం – రెట్టింపైన ఆత్మగౌరవం” కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జనార్దన్ పాల్గొని మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు.