జనగాం: రఘునాథపల్లి మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో గురువారం అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం రఘునాథపల్లి మండల కేంద్రంలో ఒడిస్సా కు చెందిన కన్వయి కుసిలియా అనే వ్యక్తి అక్రమంగా గంజాయి తరలిస్తుండగా అతన్ని పట్టుకున్నట్లు తెలిపారు.నిందితుడి వద్ద నుండి 2.07 లక్షల విలువైన 4.150 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు.నిందితుడిని జ్యూడిషియల్ కస్టడీ కి తరలించినట్లు తెలిపారు