నందికోట్కూరు: బ్రాహ్మణ కొట్కూరు నందికొట్కూరు జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ సమావేశం
నంద్యాల జిల్లా నందికొట్కూరువినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో, వైభవంగా నిర్వహించేందుకు బ్రాహ్మణకొట్కూరు, నందికొట్కూరు, జూపాడుబంగ్లా పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీసులు ప్రత్యేక శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించారు, ఉత్సవ కమిటీల నిర్వాహకులు, ప్రజలకు పండుగ ఏర్పాట్లు, భద్రతా నియమాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను అందరూ సమన్వయంతో, ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. అన్ని మతాలను గౌరవిస్తూ పండుగను సోదరభావంతో జరుపుకోవాలని కమిటీ సభ్యులకు, ప్రజలకు తెలిపారు. వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన మొదటి రోజు నుం