గిద్దలూరు: బేస్తవారిపేటలో భారీ వడగళ్ల వర్షం, వడగల్లు ఏరుకొని తినేందుకు ప్రయత్నించిన స్థానికులు
ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో ఆదివారం సాయంత్రం అగస్మాత్తుగా కురిసిన వడగళ్ల వర్షం వాతావరణం చల్లగా మారింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వడగళ్ల వర్షం కురుస్తూ ఉండడంతో ప్రజలు కేరింతల కొడుతూ వాటిని ఏరుకొని తినేందుకు ప్రయత్నించారు. ఈదురు గాలులతో జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.