ఉరవకొండ: వజ్రకరూర్ ప్రాథమిక పాఠశాలలో రాబోవు విద్యా సంవత్సరానికి ముందస్తు ప్రవేశాలు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన గ్రామ సర్పంచ్
అనంతపురం జిల్లా వజ్రకరూర్ మేజర్ గ్రామపంచాయతీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రాబోయే విద్యా సంవత్సరానికి (2026_2027) ముందస్తు ప్రవేశాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేటి రంగప్రసాద్ బాబు, గ్రామ సర్పంచ్ మోనాలిసా ఆధ్వర్యంలో అడ్మిషన్స్ సోమవారం నిర్వహించారు. ,దాదాపు ఇప్పటివరకు 12 మంది అడ్మిషన్స్ జరిగినట్లు హెడ్మాస్టర్ తెలిపారు. అనంతరం సర్పంచ్ మోనాలిసా పాఠశాలలో రికార్డులను ,విద్యార్థుల చదువుపై సామర్ధ్యాలను ,పిల్లలకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు.