వరంగల్: వరంగల్లో కిరాణా దుకాణంలో అక్రమ మద్యం విక్రయాలు: ఒకరు అరెస్ట్
వరంగల్ దేశాయిపేట పోచమ్మగుడి వద్ద కిరాణా దుకాణంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న సూర్యనారాయణను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 29,130 రూపాయల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, కేసును ఇంతేజార్గంజ్ పోలీసులకు అప్పగించారు.