రాజమండ్రి సిటీ: ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ కీర్తి చేకూరి కీలక ఆదేశాలు
జిల్లాలో ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులతో సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన, మౌలిక సదుపాయాలు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు మరియు రూట్ ప్లాన్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.