గుంతకల్లు: గుత్తి అర్ఎస్ లో హోరాహోరీగా జరిగిన క్రికెట్ టోర్నీ విజేత గుత్తి అర్ఎస్ జట్టు, విజేతలకు నగదు, ట్రోఫీలు అందజేత
అనంతపురం జిల్లా గుత్తి అర్ఎస్ రైల్వే క్రీడా మైదానంలో జరిగిన ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా గుత్తి అర్ఎస్ జట్టు నిలిచింది. గత పది రోజులుగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ లో మొత్తం 50 జట్లు పాల్గొన్నాయి. సోమవారం గుత్తి అర్ఎస్, గుంతకల్లు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన గుత్తి అర్ఎస్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 206 పరుగులు సాధించింది. గుత్తి అర్ఎస్ జట్టులో భువన్ అద్భుత ప్రతిభ కనబరిచి 81 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన గుంతకల్లు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు సాధించి ఆలౌటై ఓటమి పాలైంది.