వరంగల్: వరంగల్ NIT విద్యార్థిని తేజశ్విని మృతి: రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 రోజుల తర్వాత కన్నుమూత
వరంగల్ NITలో పీహెచ్డీ చేస్తున్న విద్యార్థిని దుడ్డెల తేజశ్విని రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించారు. గత 15 రోజులుగా ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె ఈరోజు కన్నుమూశారు. ఈ ఘటనతో విద్యార్థులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.