కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం 4 గంటలకు కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగాల సిబ్బందితో కర్నూలు స్మార్ట్ సిటీ అంశంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నగర అభివృద్ధికి అవసరమైన దీర్ఘకాలిక ప్రణాళికలు, అమలు విధానాలు, మౌలిక వసతుల విస్తరణపై కలెక్టర్ దృష్టిసారించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించి త్రాగునీటి నిరంతర సరఫరా, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, పచ్చదనం పెంపు, పార్కులు,