కాకినాడ రూరల్: కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు: 26న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు
కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 66 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 306 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 26న పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపును 30వ తేదీన చేపడతామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఏర్పాట్లను కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ స్వయంగా పరిశీలించారు.