ఆళ్లగడ్డ: కొలిమిగుండ్ల విద్యుత్ శాఖ ప్రభుత్వ ఉద్యోగి మిస్సింగ్
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల జేఈ లక్ష్మణ స్వామి అదృశ్యమయ్యారు, ఆయన భార్య లీలావతి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సిఐ రమేష్ బాబు మీడియాకు తెలిపారు, తిరుపతి లోని విద్యుత్ కార్యాలయానికి వెళ్తున్నానని చెప్పి ఈనెల ఎనిమిదో తేదీ న ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన లక్ష్మణ్ స్వామి ఇంటికి తిరిగి రాలేదు, ఆ రోజు నుంచి ఫోను పని చేయడం లేదు ఎక్కడ వెతికిన ఆచూకీ దొరకలేదు ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇలా అదృశ్యం కావడం చర్చనీయాంశంగా మారింది