జగిత్యాల: బాలికల ఉన్నత పాఠశాలలో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన కార్యక్రమం
జగిత్యాల బాలికల ఉన్నత పాఠశాలలో అక్టోబర్ 27న పోక్సో చట్టం 2012పై అవగాహన సదస్సు నిర్వహించారు. జడ్జిలు నాగేశ్వరరావు మరియు నిక్షిష పాల్గొని గుడ్ టచ్-బ్యాడ్ టచ్, బాలల రక్షణ మరియు చట్టాలపై విద్యార్థినులకు వివరించారు. ఈ సందర్భంగా బాలల భద్రతపై విద్యార్థినులు ప్రతిజ్ఞ చేశారు.