కోరుట్ల: ఐలాపూర్ మహిళపై దాడి ఘటన: సోషల్ మీడియా ప్రచారంపై DSP క్లారిటీ
కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో మహిళపై జరిగిన దాడి ఘటనలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని మెట్పల్లి DSP ఏ. రాములు స్పష్టం చేశారు. బాధితురాలి ముఖంపై మాత్రమే దాడి జరిగిందని, మిగిలిన ప్రచారంలో నిజం లేదని పేర్కొంటూ నిందితులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.