పార్వతీపురం: బాల్య వివాహాల నిర్మూలనకు 1098కు సమాచారం ఇవ్వండి: జిల్లా బాలల సంరక్షణ అధికారి
జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా పార్వతీపురంలో బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాల నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ కోరారు. ఏదైనా సమస్య ఉంటే 1098కి కాల్ చేయాలని సూచించారు.