వికారాబాద్: గ్రామకంఠం భూమిలో ఇళ్ల నిర్మాణం చేపట్టడంపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అయినాపూర్ గ్రామాన్ని సందర్శించిన DLPO సంధ్యారాణి
ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యత అధికారులదేనని వికారాబాద్ జిల్లా డీఎల్పీఓ సంధ్యారాణి పేర్కొన్నారు. గ్రామకంఠం భూమిలో ఇళ్ల నిర్మాణం చేపట్టడంపై జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఆమె మంగళవారం దోమ మండలం అయినపూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో బురుజు నేలమట్టం, దానికి రహదారిగా 12 ఫీట్లు తీర్మానంలో ఉన్నా వదలకుండా కబ్జా చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఇళ్ల నిర్మాణంపై భూమికి, ఇంటికి సంబంధించిన ఎలాంటి పత్రాలు ఉన్నా ఇరువర్గాల వారు పంచాయతీ కార్యదర్శికి అందజేయాలని సూచించారు.