వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో3 రోజుల పాటు జరిగిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం - జిల్లా వైద్య శాఖ అధికారి పాల్వన్ కుమార్.
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు జరిగిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పాల్గొన్న కుమార్ తెలిపారు. మంగళవారం మర్పల్లి ట్రాన్సిట్ పాయింట్ ను సందర్శించిమాట్లాడుతూ, వికారాబాద్ జిల్లాలో ఐదు సంవత్సరాలలోపు 94,558 మంది పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం జరిగిందని, ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా 2500 మంది సిబ్బంది, పలు శాఖల సమన్వయంతో, ప్రజల సహకారంతో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు.