వికారాబాద్: మన ఊరు మనబడి పనులు వెంటనే పూర్తి చేయాలి- జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
జిల్లాలో మన ఊరు మన బడి క్రింద చేపట్టిన నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలనీ సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్సు ద్వారా జిల్లాలో జరిగే మన ఊరు మనబడి క్రింద చేపట్టిన పెండింగ్ పనులను పూర్తిచేయాలనీ, సిసి రోడ్ల నిర్మాణ పనులు, మన ఊరు మన బడి పాఠశాలలకు అవసరమయ్యే పనులను పూర్తి చేయాలని అన్నారు.