వికారాబాద్: పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న సందేశ్ కాళీ ఘటనపై జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన ఏబీవీపీ నాయకులు
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ను కలిసి వికారాబాద్ జిల్లా ఏబీవీపీ కన్వీనర్ హరీష్ రావు వినతిపత్రం అందజేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు షాజహాన్, అతని అనుచరులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సందేశ్ కాళీ అనే మారుమూల గిరిజన జాతిపై దాడులను ఖండించారు. భూ ఆక్రమణలు, మహిళపై లైంగిక దాడులు చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్య నాయక్‌కు వినతిపత్రం సమర్పించారు.