వికారాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వక కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల చేవెళ్ల అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని సచివాలయంలో ఆయన సీఎంను కోరారు. ఈ భేటీలో ఎటువంటి రాజకీయ కోణం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.