కాకినాడ రూరల్: కాకినాడ రూరల్లో టీడీపీలోకి చేరిన 20 మంది వైసీపీ కార్యకర్తలు
కాకినాడ రూరల్ నియోజకవర్గం వలసపాకల గ్రామంలో 20 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతుల సమక్షంలో వారు పార్టీ కండువాలు కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు.