తాడూరు: తాడూర్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆత్మహత్యల నివారణపై అవగాహన
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా తాడూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. టెలి మానస్ 14416 నెంబర్ ప్రాముఖ్యత మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అధికారులు వివరించారు.