జనగాం: నిరుపేదలకు వైద్య సేవలు అందించడం పట్ల వైద్యులు బాధ్యత యుతంగా వ్యవరించాలి: జిల్లా ఇంచార్జి కలెక్టర్ పింకేష్ కుమార్
నిరుపేదలకు వైద్య సేవలు అందించడం పట్ల డాక్టర్ లు బాధ్యత యుతం గా వ్యవహారించాలని ఇంచార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు.శుక్రవారం ఓబుల్కేశ్వపూర్ PHC ని ఇంచార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ ఆకస్మిక తనికి చేసి ముందుగా డ్యూటీ డాక్టర్ ల రిజిస్టర్,ఒపీ, ఇన్ పేషంట్ తదితర రిజిస్టర్ లను పరిశీలించారు.స్వస్థ నారీ సశక్తి పరివార్ అభయాన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు పిఎచ్సీ లో ప్రముఖ డెంటల్ డాక్టర్ చే ఎస్పెషాలిటీ రోజు నిర్వహిస్తున్న క్లినిక్ ని ఇంచార్జ్ కలెక్టర్ సందర్శించారు.