కాకినాడ రూరల్: ఏలేశ్వరం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఐజి అశోక్ కుమార్: అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు!
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం, ఏలేశ్వరం పురపాలక సంఘం పరిధిలో ఐజి అశోక్ కుమార్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని, అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఐజి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ బిందు మాధవ్, డిఎస్పి తిలక్ పాల్గొన్నారు.