కొత్తపేట: వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు ప్రారంభం
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు ప్రారంభమైంది. దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో, సీసీ కెమెరాల నిఘా మరియు పటిష్టమైన భద్రత మధ్య ఈ కార్యక్రమం జరుగుతోంది. ఆలయ సిబ్బంది, సేవా సమితి సభ్యులు ఇందులో పాల్గొంటున్నారు.