జగిత్యాల: జగిత్యాల చెరువుల అభివృద్ధికి అమృత్ 2.0 నిధులు: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాలలోని చింతకుంట, మోతె, రాయికల్ పెద్ద చెరువులను అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. అమృత్ 2.0 పథకం కింద చెరువులను సుందరీకరించి, మురుగునీరు కలవకుండా శాశ్వత పరిష్కారాలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు.