మహబూబాబాద్: మహబూబాబాద్‌లో మట్టి గణపతుల పంపిణీ: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మున్సిపల్ శాఖ చర్యలు
మహబూబాబాద్‌లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ జరిగింది. మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్ నాయక్ పాల్గొని, మట్టి గణపతులను వాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వినోద్ కుమార్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.