విశాఖపట్నం: ఏపీలో తుఫాను హెచ్చరిక: రాబోయే 3 రోజులు భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రానున్న 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 26 నాటికి ఇది తుఫానుగా మారే సూచనలు ఉన్నాయి. గంటకు 50 కిమీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.