పలమనేరు: వినాయక చవితి నిబంధనలు: మండపాల నిర్వాహకులకు పోలీసుల హెచ్చరికలు!
వినాయక చవితి వేడుకల సందర్భంగా వినాయక మండపాల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలను సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి వివరించారు. డీజేలకు అనుమతి లేదని, ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకే భక్తి పాటలకు అవకాశం ఉందని, మండపం వద్ద 24 గంటలూ నిర్వాహకులు ఉండాలని స్పష్టం చేశారు.