రాయచోటి ఆలయంలో నాగుపాము కలకలం
రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలోకి నాగుపాము ప్రవేశించడంతో భక్తుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. పామును గమనించిన భక్తులు భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు.తక్షణమే ఆలయ నిర్వాహకులు స్నేక్ క్యాచర్ను సమాచారమిచ్చి, పామును సురక్షితంగా పట్టుకుని సంచిలో బంధించారు. అనంతరం ఆలయ అర్చకులు, ఈవో రమణారెడ్డి మరియు భక్తులు పాముకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.తరువాత పామును పట్టణ శివారులో వదిలిపెట్టారు.ఈ ఘటన స్థానికులలో ఆసక్తి, భయం కలగలిపిన చర్చకు దారితీసింది.