పుంగనూరు: పుంగనూరులో అక్రమ ట్రేడింగ్ మోసాలు: ప్రధానికి ఫిర్యాదు
పుంగనూరులో అక్రమ ట్రేడింగ్ పేరుతో సాగుతున్న ఆర్థిక మోసాలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని బీజేపీ నేత పి. అయూబ్ ఖాన్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాల పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలను మోసం చేస్తున్నారని, వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.