చోడవరం: రోలుగుంటలో మొదలైన పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు: 18 నుంచి నామినేషన్ల స్వీకరణ
రోలుగుంట మండలంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 24 పంచాయతీలకు సంబంధించి ఈ నెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులు మరియు సిబ్బంది నిమగ్నమయ్యారు.