నల్గొండ: నవంబర్ 15న నల్గొండలో భారీ రైతు మహాసభ: సభను జయప్రదం చేయాలని సీఐటీయూ పిలుపు
నల్గొండలో నవంబర్ 15న జరగనున్న 36వ అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పాల్గొనాలని కోరుతూ నల్గొండలో బైక్ ర్యాలీ నిర్వహించారు.