కాకినాడ సిటీ: తొండంగిలో ఎంపీటీసీ నామినేషన్ల వద్ద ఉద్రిక్తత: పోలీసులతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వాగ్వాదం
కాకినాడ జిల్లా తొండంగిలో ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. 144 సెక్షన్ పేరుతో నామినేషన్ అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది.