బెల్లంపల్లి: బూదకలాన్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బూదకలాన్ గ్రామంలోని అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య పరిశీలించారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్, కల్వర్టు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలను నాణ్యతతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.