పూతలపట్టు: పీఎస్ అగ్రహారంలో పంచాయతీ ఎన్నికల బహిష్కరణ: డ్రైనేజీ కోసం గ్రామస్తుల ఆందోళన
ఇరాల మండలం పీఎస్ అగ్రహారంలో డ్రైనేజీ వ్యవస్థ లేదని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలను బహిష్కరిస్తూ బ్యానర్ ఏర్పాటు చేశారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చే అభ్యర్థికే ఓటు వేస్తామని వారు స్పష్టం చేశారు.