మేడ్చల్: ఎదులాబాద్‌లో ఘనంగా 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' వేడుకలు
మేడ్చల్ నియోజకవర్గం ఎదులాబాద్‌లో 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' కార్యక్రమం జరిగింది. డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో మరో 4,000 ఇళ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.