ఆళ్లగడ్డ: గండ్లేరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని గండ్లేరు రిజర్వాయర్ నుంచి దిగువకు నీటిని శుక్రవారం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విడుదల చేశారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటిని విడుదల చేశామన్నారు, గండ్లేరు రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచేందుకు 40 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు భూమా అఖిలప్రియ వెల్లడించారు