వికారాబాద్: జిల్లాలో మన ఊరు, మన బడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
జిల్లాలో మన ఊరు, మన బడి పథకం కింద చేపట్టిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. మంగళవారం అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించి, అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు, మన ఊరు మనబడి, పాఠశాలలకు అవసరమయ్యే పనులను పెండింగ్‌లో ఉంచకుండా 100% పనులు పూర్తిచేయాలని సూచించారు.