ఇల్లంతకుంట: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు..
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జంగారెడ్డిపల్లె గ్రామంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న మామిడి శ్రీకాంత్ అనే వ్యక్తిని మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 43 గ్రాముల గంజాయి, ఒక ద్విచక్రవాహనం, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కార్ డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీకాంత్ ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి వ్యాపారం మొదలుపెట్టగా, కరీంనగర్ నుంచి కొనుగోలు చేసి అమ్మే ప్రయత్నంలో పట్టుబడ్డాడు.