మేడ్చల్: గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ఘట్కేసర్ విద్యార్థులు! అభినందించిన సుదర్శన్ రెడ్డి
ఘట్కేసర్ జీఎన్ఆర్ అకాడమీకి చెందిన నలుగురు విద్యార్థులు తైక్వాండోలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో వీరు ప్రతిభ కనబరిచారు. ఈ విజయం సాధించిన విద్యార్థులను ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు అభినందించి, ఘనంగా సత్కరించారు.