కొండపి: కొండపి నియోజకవర్గం లోని మర్రిపూడి మండలం లో విపరీతంగా కురిసిన మంచు, ఒకటి పూట పెరిగిన ఉష్ణోగ్రతలు
ప్రకాశం జిల్లాలో ఒకేరోజు రెండు రకాల వాతావరణ మార్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం కొండపి నియోజకవర్గం లోని మర్రిపూడి మండలంలో ఉదయం 10 గంటల వరకు కూడా మంచు కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులను పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ చెబుతున్న వివరాల మేరకు ఈనెలాఖరి కల్లా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు..