కొండపి: కొండేపీ పొగాకు వేలం కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన బోర్డు రీజినల్ మేనేజర్ లక్ష్మణరావు
ప్రకాశం జిల్లా కొండపి లోని పొగాకు వేలం కేంద్రాన్ని శుక్రవారం పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ లక్ష్మణరావు ఆకస్మికంగా సందర్శించారు. గురువారం రైతులు గిట్టుబాటు ధర లభించడం లేదని పొగాకు వేలం కేంద్రం వద్ద నిరసనకు దిగారు. ఈ విషయం లక్ష్మణరావు దృష్టికి రావడంతో అక్కడికి చేరుకొని రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రోజురోజుకి పొగాకు ధరలు దిగజారుతున్నాయని దీంతో తాము నష్టపోతున్నామని రైతులు లక్ష్మణరావు తెలిపారు. ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరిస్తానని రైతులకు లక్ష్మణరావు హామీ ఇచ్చారు.