ఇల్లంతకుంట: బాలికను వేధింపులకు గురి చేసిన యువకుడికి 14 రోజుల రిమాండ్ విధించిన మెజిస్ట్రేట్...
బాలికపై వేధింపులు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్... కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలానికి చెందిన ఒక బాలికను వేధిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసారు.వివరాలలోకి వెళితే అంబాలాపూర్ గ్రామానికి చెందిన హరీష్ అనే యువకుడు తమ కుమార్తెను మానసికంగా వేధిస్తున్నాడని తల్లిదండ్రులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హుజూరాబాద్ మెజిస్ట్రేట్ ఎదుట హరీషన్ను పోలీసులు హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది.